నిత్యామీనన్ ఎప్పుడూ లేంది వెబ్ సిరీస్ లో ఇలా..

నిత్యామీనన్ ఎప్పుడూ లేంది వెబ్ సిరీస్ లో ఇలా..

థియేటర్లు మూతపడ్డ కారణంగా ఓటీటీలో సినిమాలు చూసి ఆనందించేస్తున్నారు సినిమా ప్రియులు. ఈ మధ్య వస్తున్న వెబ్ సిరీస్ లు కూడా ఆకట్టుకుంటున్నాయి. చాలా మంది వెబ్ సిరీస్ లు చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా నిత్యా మీనన్ నటించిన బ్రీత్.. ఇన్ టు ద షాడోస్ విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఇందులో అభిషేక్ బచ్చన్, నిత్యామీనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. చిత్రాల్లో ఏమాత్రం ఎక్స్ పోజింగ్ చేయని నిత్య.. వెబ్ సిరీస్ లో మాత్రం లిప్ లాక్ చేసి హాట్ గా కనిపించడంతో పాటు లెస్బియన్ గా నటించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి దుమ్మురేపుతోంది. నిత్య ఏంటి ఇలా మారిపోయింది అని అభిమానులు షాకవుతున్నారు. మరి ఈ సన్నివేశాలు చూసి నిత్య అభిమానులు పెరుగుతారో.. తగ్గుతారో.

Tags

Read MoreRead Less
Next Story