కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి గుడ్‌న్యూస్!

కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి గుడ్‌న్యూస్! కరోనా వైరస్ వ్యాక్సిన్‌పై పట్నా ఎయిమ్స్ కీలక ప్రకటన చేసింది. సోమ‌వారం నుంచి కరోనా వ్యాక్సిన్ హ్యూమ‌న్‌ ట్రయల్స్ ప్రారంభించినట్లు తెలిపింది. హాస్పిటల్ అథారిటీ ఎంపిక చేసిన 18 మంది వాలెంటీర్లపై ట్రయల్స్ మొదలుపెట్టినట్లు వెల్లడించింది. వాలెంటీర్‌లు మొత్తం 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్కులని పాట్నా ఎయిమ్స్ వివరించింది. ఆ 18 మందికి మెడికల్ చెకప్‌లు చేసి, వారి రిపోర్టుల‌ను పరిశీలించాక ట్రయల్స్ మొదలు పెట్టనున్నట్లు స్పష్టంచేసింది. ఐసీఎమ్మార్‌ మార్గదర్శకాల ప్రకారం.. సోమ‌వారం అంద‌రికీ మెడికల్ చెకప్‌లు నిర్వహించామ‌ని తెలిపింది.

Recommended For You