కరోనా కట్టడికి తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం

కరోనా కట్టడికి తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల ఆఖరు వరకు ప్రజా, ప్రైవేటు రవాణాను నిషేధించింది. ప్రస్తుతం 15 వరకూ ప్రజారవాణ నిషేధంలో ఉంది. ఈ నిషేధాన్ని 31 వరకు కొనసాగిస్తున్నట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, క్యాబులు, ఆటోలకు మాత్రం అనుమతిచ్చింది. కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తోందని ప్రభుత్వం తెలిపింది. కరోనా నిబంధనలు పాటిస్తూ.. ప్రతీ ఒక్కరూ ప్రభుత్వంతో సహకరించాలని ప్రభుత్వం కోరింది.

Recommended For You