ఏపీలో కొత్తగా 2,412 కరోనా కేసులు..

ఏపీలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 22,197 సాంపిల్స్‌ ని పరీక్షించగా 2,412 మంది కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. అలాగే కొత్తగా 805 మంది కోవిడ్‌ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్ట్‌ అయ్యారు. కోవిడ్‌ వల్ల అనంతపూర్‌ లో తొమ్మిది మంది, పశ్చిమ గోదావరి లో తొమ్మిది మంది, కర్నూల్‌ లో ఐదుగురు, చిత్తూరులో నలుగురు, తూర్పు గోదావరి లో నలుగురు, విశాఖపట్నం లో నలుగురు, కడప లో ఇద్దరు, కృష్ణ లో ఇద్దరు, ప్రకాశం లో ఇద్దరు,

నెల్లూరు లో ఒక్కరు, శ్రీకాకుళం లో ఒక్కరు, విజయనగరం లో ఒక్కరు మరణించారు. ఇవాళ్టి వరకు రాష్ట్రంలో 12,17,963 సాంపిల్స్‌ ని పరీక్షించారు. రాష్ట్రంలో 14,059 మంది ఆసుపత్రులలో.. 2,562 మంది కోవిడ్‌ కేర్‌ సెంటర్స్‌ లో కలిపి మొత్తం 16,621 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 32,575 పాజిటివ్ కేసు లకు గాను 16,032 మంది డిశ్చార్జ్ కాగా.. 452 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 16,091 గా ఉంది.

Recommended For You