ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీ

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం అధ్యయన కమిటీని నియమించనున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ కమిటీ పనిచేస్తుదని కేబినెట్‌ నిర్ణయించింది. ఇందులో మంత్రులు, అధికారులు సభ్యులుగా ఉండే అవకాశం ఉంది. కమిటీ వచ్చే ఏడాది మార్చి 31వ తేదీలోగా జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఈ కమిటీ ముఖ్యంగా కొత్త జిల్లాల సాధ్యాసాధ్యాలపై, అదనపు భారంపై అధ్యయనం చేయనుంది. మరోవైపు క్యాబినెట్ లో 26 వ జిల్లా ఏర్పాటుపై కూడా చర్చ జరిగింది. కొత్తగా ఏర్పాటు కానున్న అరకు జిల్లా భౌగోళికంగా 4 జిల్లాలలో ఉండటం వలన అరకును రెండు జిల్లాలు చేసేందుకు అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

Recommended For You