ఐపీఓకు రానున్న బార్బిక్‌ నేషన్‌ హాస్పిటాలిటీ

ఐపీఓకు రానున్న బార్బిక్‌ నేషన్‌ హాస్పిటాలిటీ

నిధుల సమీకరణ కోసం ఐపీఓకు వచ్చేందుకు బార్బిక్‌ నేషన్‌ హాస్పిటాలిటీ సిద్ధమైంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రాస్పెక్టస్‌ సమర్పించగా సెబీ తాజాగా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.వెయ్యి కోట్ల నుంచి రూ.2వేల కోట్ల నిధులనుసమీకరించాలని భావిస్తోంది.

ఇష్యూలో భాగంగా రూ.275 కోట్ల విలువైన షేర్లతో పాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ పద్ధతిలో 98.22 లక్షల షేర్లను కంపెనీ జారీ చేయనుంది. ఈ ఇష్యూకు ప్రైవేట్‌ ఈక్విటీ ఇన్వెస్టర్‌ CX పార్ట్‌నర్స్‌, ఏస్‌ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ ఆల్కెమీ క్యాపిటల్‌ మద్దతు ఉంది. ఈ కంపెనీలో ప్రమోటర్లకు 60.24 శాతం, CX పార్ట్‌నర్స్‌కు 33.79శాతం, ఆల్కెమీ క్యాపిటల్‌కు 2.05 శాతం వాటా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story