శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద ప్రవాహం

శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద ప్రవాహం

ఎగువన విస్తారంగా కురుస్తున్న వర్షాలు దిగువ ప్రాజెక్టుల్లో కొత్త ఆశలు నింపుతున్నాయి. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు జలకళన సంతరించుకుంటున్నాయి. ఇప్పటికే ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు‌ దాదాపుగా నిండేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు వరద ప్రవాహం పెరుగుతుండటంతో జూరాల నిండుకుండను తలపిస్తోంది. దాంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు చేరుకుంటోంది.

బుధవారం ఉదయం నాటికి 49,895క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇందులో జురాల నుంచి 48,795 క్యూసెక్కులు, హంద్రీనీవా నుంచి 1100 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి వస్తుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటిమట్టం మట్టం 815.50 అడుగులు, ఇక్కడ మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 37 టీఎంసీల నీవు అందుబాటులో ఉంది.

Tags

Read MoreRead Less
Next Story