నిరాడంబరంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

నిరాడంబరంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఇప్పటి వరకూ జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు భిన్నంగా.. ఈ ఏడాది నిర్వహించనున్నారు. కరోనా మహమ్మరి నేపథ్యంలో నిరాడంబరంగా స్వతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎర్రకోట దగ్గర నిర్వహించే ఈ వేడుకుల్లో గతంతో పోల్చుకుంటే.. 20శాతం మంది మాత్రమే పాల్గొననున్నారు. విద్యార్థినీ, విద్యార్థులు ఈ సారి పాల్గొరనే వార్తాలు వినిపిస్తున్నాయి. గతంలో సుమారు 900 మంది వీవీఐపీలు పాల్గొనేవారు. కానీ, ఈ ఏడాది మాత్రం 100 మంది మాత్రమే పాల్గొంటారని తెలుస్తుంది. కానీ, ఈ ఏడాది వేడుకల్లో కరోనా నుంచి కోలుకున్న 1500 మంది హాజరుకానున్నారు. ఇందులో 500 మంది పోలీసులు కాగా.. మిగిలినవారు దేశంలో వివిధ ప్రాంతాలకు చెందినవారు.

Tags

Read MoreRead Less
Next Story