ఫోటోగ్రాఫర్ కి ఎదురైన వింత అనుభవం.. మరణించిన వ్యక్తిని ఫొటోలు తీస్తుంటే..

ఫోటోగ్రాఫర్ కి ఎదురైన వింత అనుభవం.. మరణించిన వ్యక్తిని ఫొటోలు తీస్తుంటే..

25 ఏళ్ల ఫొటోగ్రాఫర్ కెరీర్ లో ఎప్పుడూ ఇలాంటి అనుభవం ఎదురవలేదు.. మరణించిన వ్యక్తిని ఫొటోలు తీస్తుంటే సన్నగా మూలుగు వినిపించింది.. కెమెరా అక్కడ పడేసి పరుగు పెడదామనుకున్నాడు. కానీ ధైర్యాన్ని కూడగట్టుకుని పోలీసులకు సమాచారం అందించాడు.. ఈ వింత ఘటన కేరళ లోని ఎర్నాకులంలో జరిగింది. టామీ థామస్ పేరొందిన ఫోటోగ్రాఫర్. శివదాసన్ అనే వ్యక్తి తీవ్ర గాయాలతో అనుమానాస్పదంగా మృతి చెందాడని ఇంక్వెస్ట్ రిపోర్ట్ నిమిత్తం అతని మృతదేహాన్ని ఫోటోలు తీయాలని పోలీస్ స్టేషన్ నుంచి థామస్ కు కాల్ వచ్చింది. దీంతో మరణించిన శివదాసన్ వ్యక్తి ఇంటికి వెళ్లి మృతదేహాన్ని ఫోటోలు తీయడం మొదలు పెట్టాడు థామస్. ఇంతలో ఎవరో మూలిగిన శబ్ధం వినిపించింది. ఆ శబ్దాలు విని ఒక్కసారిగా షాకయ్యాడు. చనిపోయాడనుకున్న వ్యక్తి నుంచి వస్తున్నాయని తెలుసుకుని ఒక్క ఉదుటున బయటకు పరుగుతీసి పోలీసులకు చెప్పి వారిని అలర్ట్ చేశాడు. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకుని శివదాసన్ బతికే ఉన్నాడని తెలుసుకున్నారు. హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించారు. అతడికి ప్రస్తుతం త్రిసూర్ లోన జూబ్లీ మిషన్ హాస్పిటల్ లో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఫోటోగ్రాఫర్ థామస్ స్పందిస్తూ 25 తన కెరీర్ ఇలాంటి సంఘటన ఎప్పుడూ ఎదురు కాలేదని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story