స్వావలంబన భారత్ కోసం నైపుణ్యం అవసరం: మోదీ

ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ యువతనుద్దేశించి ప్రసంగించారు. ప్రపంచం చాలా వేగంగా అభివృద్ది చెందుతుందని.. దానికి తగ్గట్టు యువత నైపుణ్యాలను పెంచుకోవాలని అన్నారు. ముఖ్యంగా ఆరోగ్యసేవల్లో నైపుణ్యం చాలా అవసరమని అన్నారు. అభివృద్ధి చెందుతున్న ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని.. స్కిల్ ఇండియా మిషన్ ఏర్పాటు చేశామని అన్నారు. దీనిలో భాగంగా ఇప్పటివరకూ ఐదుకోట్ల మందిలో నైపుణ్యాలకు పెంపొందించామని అన్నారు. ఐటీఐల సంఖ్యను కూడా భారీగా పెంచామని.. లక్షలాది సీట్లు చేర్చామని మోదీ తెలిపారు. నాలుగైదు రోజుల క్రితం కార్మికుల కోసం స్కిల్ మ్యాపింగ్ పోర్టల్ విడుదల చేశామని అన్నారు. నైపుణ్యం కలిగిన వ్యక్తులను, కార్మికులను మ్యాపింగ్‌ చేయడంలో ఈ పోర్టల్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నారు. స్వావలంబన భారతదేశానికి నైపుణ్యం అవరమని మోదీ అన్నారు.

Recommended For You