ఆరోజు ఎక్కడ ఉన్నావు ఓలీ: శివసేన

ఆరోజు ఎక్కడ ఉన్నావు ఓలీ: శివసేన

శ్రీరాముడుపై వివాధాస్పద వ్యాఖ్యలు చేసిన నేపాల్ ప్రధాని ఓలీపై శివసేన తీవ్రంగా స్పందించింది. చైనా ఒత్తిడితోనే ఆయన అలా మాట్లాడుతున్నారని శివసేన అటుంది. ఓలీ.. చైనాకు పప్పెట్ లా మారిపోయారని శివసేన అధికారిక పత్రిక సామ్నా మండిపడింది. చైనా సూచనల మేరకు ఓలీ.. భారత్ తో వివాదానికి దిగుతున్నారని మండిపడింది. మొదట్లో సరిహద్దు అంశాలు, ఇప్పుడు రాముడు అంశం.. ఇలా ప్రతీ అంశంలో కూడా ఓలీ వ్యాఖ్యలు వెనుక చైనా ఉందని ఆరోపించింది. అయోద్య భారత్ లో లేదని.. నేపాల్ లో ఉందని ఓలీ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని సామ్నా రాసుకొచ్చింది. పురాణాల ప్రకారం అయోధ్య సరయూ నది ఒడ్డున ఉందని.. కానీ, నేపాల్ లో సరయూ అనే పేరుతో లేదని స్పష్టం చేసింది. కర సేన సమయంలో చాలా మంది కర సేవకులు తమ రక్తం చిందించారని.. ఆ సమయంలో ఓలీ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించింది. ఈ రోజు రాముడు మా వాడు అంటున్న ఓలీ.. మరికొన్ని రోజుల్లో బాబర్ కూడా మావాడని వాదిస్తారని సామ్నా ఎద్దేవా చేసింది. భారత్, నేపాల్ మధ్య ఉన్న సాంస్కృతిక బంధాన్ని మరిచిపోయి ఓలీ మాట్లాడుతున్నారని, చైనా బెదిరింపులతోనే ఇలా మాట్లాడుతున్నారని శివసేన ఆరోపించింది.

Tags

Read MoreRead Less
Next Story