కొత్త జిల్లాల ఏర్పాటు అధ్యయన కమిటీ సభ్యులు వీరే..

కొత్త జిల్లాల ఏర్పాటుకై అధ్యయన కమిటీని ఏర్పాటు చేసేందుకు ఇవాళ ఏపీ కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటు కానున్న ఈ కమిటీలో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రతినిధి, సీసీఎల్‌ఏ కమిషనర్, జీఏడీ సర్వీసుల సెక్రటరీ, ప్లానింగ్‌ విభాగం సెక్రటరీ, కన్వీనర్‌గా ఫైనాన్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సభ్యులుగా ఉండనున్నారు. కాగా రాష్ట్రంలో 25 – 26 జిల్లాల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను ఈ కమిటీ

అధ్యయనం చేయనుంది. కాగా ఏపీలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా చేస్తానని జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జిల్లాలు అవుతాయని భావిస్తున్న పార్లమెంటు నియోజకవర్గాలు ఇలా ఉన్నాయి. అనంతపురం , హిందూపురం, చిత్తూరు , తిరుపతి, కడప, రాజంపేట, కర్నూల్ , నంద్యాల , నెల్లూరు, ఒంగోలు, బాపట్ల, నరసరావుపేట, గుంటూరు, విజయవాడ, మచిలీపట్టణం, ఏలూరు, నరసాపురం, రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, అనకాపల్లి, విశాఖపట్నం, అరకు, విజయనగరం, శ్రీకాకుళం లు ఉన్నాయి.

Recommended For You