బోల్తాప‌డిన వైన్ ట్ర‌క్కు.. బాటిళ్ల‌ కోసం ఎగబడ్డ మందుబాబులు!

హైవేలో ఓ వైన్ ట్రక్ యాక్సిడెంట్ అయ్యింది. వైన్ బాటిల్ కార్టన్స్ అన్నీ తిరగబడ్డాయి. అది చూసిన మందు బాబులు బాటిళ్ల‌ను ఎగ‌బ‌డి మ‌రీ తీసుకుంటున్నారు. ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది.

చెన్నై తంబరమ్ హైవేపై వైన్ ట్రక్ క్రిందపడిపోయింది. విషయం తెలిసిన స్థానికులు మందు బాటిళ్ల‌ కోసం ఎగబడ్డారు. అందినకాడికి మందు బాటిళ్లు పట్టుకుపోయారు . చింత‌కాయ‌లు ఏరిన‌ట్టు ఏరుకొని బాటిళ్ల‌ను సంచిలో వేసుకున్నారు. ఇక మందు బాబులైతే క‌ట్టుకున్న లుంగీల‌నే సంచులుగా మార్చుకున్నారు. ఆ లుంగీలోనే మందు బాటిల్ వేసుకుని వెళ్లిపోయారు.

Recommended For You