వచ్చే ఏడాది 5జీ వ్యవస్థ అందుబాటులోకి తెస్తాం: ముఖేష్ అంబానీ

వచ్చే ఏడాది 5జీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొని వస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ ప్రకటించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తమ కంపెనీ 5జీ సిస్టంను సిద్దం చేసిందని ఆయన తెలిపారు. సున్నా నుంచి ఈ 5జీ వ్యవస్థ తయారు చేశామని అన్నారు. అన్ని అనుకున్నట్టు జరిగితే.. వచ్చే ఏడాది ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొని వస్తామని అన్నారు. 5జీ స్పెక్ట్రమ్ అందుబాటులోకి రాగానే.. ట్రయల్స్ ప్రారంభిస్తామని ముఖేష్ అంబానీ అన్నారు.

Recommended For You