చవకైన కరోనా కిట్ తయారు చేసిన ఢిల్లీ ఐఐటీ

చవకైన కరోనా కిట్ తయారు చేసిన ఢిల్లీ ఐఐటీ

కరోనాను అంతమొందించడానికి కరోనా వ్యాక్సిన్ తయారీలో ప్రపంచం మొత్తం నిమగ్నమైంది. అయితే, ఈ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు కరోనా పరీక్షలు చేయాలని వైద్యనిపుణులు అంటున్నారు. కానీ, కరోనా పరీక్షలకు పెద్ద మొత్తంలో ఖర్చు అవ్వడంతో.. కొన్ని ప్రభుత్వాలు పరీక్షలు జరపడానికి ఆలోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత చవకైన కరోనా టెస్ట్ కిట్ ను ఐఐటీ ఢిల్లీ రూపొందించింది. ఈ కిట్ ను కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఆవిష్కరించారు. దీని ఖరీదు 650 రూపాయలు కావడంతో ప్రపంచంలోనే ఇది అత్యంత చవకైన ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షగా చెప్పొచ్చు. ఈ పరీక్షలకు ఐసీఎంఆర్, డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా అనుమతి ఇచ్చింది. న్యూటెక్ మెడికల్ డివైసెస్ కంపెనీ.. కరోషూర్ పేరిట ఈ కిట్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈకిట్ అందుబాటులోకి వస్తే.. కరోనా పరీక్షల్లో మరింత వేగం పెరిగే అవకాశం ఉందని వైద్యనిపుణులు చెబతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story