‘ఈగ’ విలన్ నాలుగు ప్రభుత్వ పాఠశాలలను..

తెలుగు ప్రేక్షకులు ఈగ చిత్రం తరువాత సుదీప్ ని ఎన్ని సినిమాల్లో చూసిన ఈగ విలన్ అంటేనే టక్కున గుర్తుపడతారు. అంత బాగా నటించాడు సుదీప్ ఆ చిత్రంలో. రాజమౌళి డైరక్షన్ లో వచ్చిన ఆ అద్భుత చిత్రంలో నటించే అవకాశం సుదీప్ కి వచ్చింది. అతడిని నటుడిగా మరో మెట్టు పైకి తీసుకువెళ్లింది ఈగ. ఈ శాండల్ వుడ్ స్టార్ కరోనా బాధితులకు సహాయం చేయడంలో ముందు వరుసలో ఉన్నారు. తాజాగా కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలోని 4 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. ఉపాధ్యాయులకు జీతాలు అందించడం, విద్యార్థులకు స్కాలర్‌షిప్ అమలు చేయడం వంటి కార్యక్రమాలను తన ఛారిటీ ద్వారా అందిస్తున్నారు. పాఠశాల అభివృద్ధికి తోడ్పడుతూ ఎప్పటికప్పుడు వాలంటీర్లను పంపించి తనిఖీలు చేయిస్తున్నారు. ప్రభుత్వ స్కూల్స్ లో విద్యాప్రక్రియను డిజిటలైజ్ చేయడంలో సహాయపడటానికి కంప్యూటర్లను ఏర్పాటు చేస్తున్నారు.

Recommended For You