సుశాంత్ ది ఆత్మహత్య కాదు.. చంపించారు: నిఘా సంస్థ ‘రా’

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్నాడనే విషయాన్ని అభిమానులతో పాటు ఏ ఒక్కరూ జీర్ణించుకోలేకపోయారు. సుశాంత్ మరణానికి దారితీసిన పరిస్థితుల గురించి బాలీవుడ్ లో ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇండస్ట్రీ ఓ మంచి నటుడ్నికోల్పోయిందని పలువురు అభిప్రాయపడ్డారు. ఎంతో భవిష్యత్ ఉన్న సుశాంత్ అర్ధాంతరంగా తనువు చాలించడం.. బలవన్మరణానికి దారి తీసిన పరిస్థితులపై ఇంకా ఎంక్వైరీ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో సుశాంత్ మరణంపై భారత అత్యున్నత నిఘా సంస్థ ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) మాజీ అధికారి ఎన్‌కే సూద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆయన ఒక వీడియోలో మాట్లాడుతూ సుశాంత్‌ది ఆత్మహత్య కాదని, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ముఠానే హత్య చేసిందని ఆరోపించారు. దీని వెనుక దావూద్ ప్రమేయం కూడా ఉందని అన్నారు. చాలా మంది బి-టౌన్ సెలబ్రెటీలు విదేశాలలో దావూద్ బృందం నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొంటారు. గ్యాంగ్ స్టర్ డబ్బు సంపాదించడానికి సహాయం చేస్తుంటారు. ఇది ISI నిధుల కోసం ఉపయోగించబడుతుంది. సెలబ్రెటీలు ప్రతిఫలంగా భారీ మొత్తంలో డబ్బును అందుకుంటారు అని సూద్ అన్నారు. ఈ ముఠానే సుశాంత్ ని ఫోన్ ద్వారా బెదిరించిందని, అది అతడిని మానసికంగా చాలా ఇబ్బంది పెట్టిందని సూద్ పేర్కొన్నారు.

అంతేకాకుండా దావూద్ నుంచి తప్పించుకునేందుకు సుశాంత్ తన ఫోన్ నంబరును 50 సార్లు మార్చాడని అన్నారు. సుశాంత్ మరణానికి ఒక రోజు ముందు సిసిటివి కెమెరాలు ఆగిపోవడం గురించి కూడా మాట్లాడారు. అతడు ఆత్మహత్య చేసుకున్న గది తాళం కూడా నకిలీవి అక్కడ ఉంచబడ్డాయి. ఆత్మహత్య కాదు.. హత్య అనడానికి ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి అని అన్నారు. ముంబై పోలీసులు సుశాంత్ ఆత్మహత్య విషయంలో నెలకొన్న భిన్న వాదనలను ఇంకా ఛేదించలేకపోతున్నారు.

Recommended For You