కరోనా చికిత్సకు వచ్చిన బాలికపై గార్డు అఘాయిత్యం

కరోనా చికిత్సకు వచ్చిన బాలికపై గార్డు అఘాయిత్యం

క్వారంటైన్ కేంద్రాల్లో కొందరు మృగాళ్లు రెచ్చిపోతున్నారు. కరోనా చికిత్స కోసం ఏర్పాటు చేసిన కొన్ని క్వారంటైన్ కేంద్రాల్లో లైంగిక వేధింపుల ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా బీహార్‌‌లో మరో దారుణ ఘటన జరిగింది. కరోనా చికిత్స కోసం క్వారంటైన్‌ కేంద్రానికి వచ్చిన బాలికపై సెక్యూరిటీ గార్డు అఘాయిత్యం చేశాడు.

పట్నా మెడికల్ కళాశాల కొవిడ్ ఆసుపత్రిలో మహేష్ ప్రసాద్ గత మూడు నెలలుగా గార్డుగా పనిచేస్తున్నాడు. రెండ్రోజుల క్రితం కరోనా లక్షణాలతో అక్కడికి వచ్చిన బాలికపై మహేష్ కన్నేశాడు. ఆమె వివరాలు నమోదు చేస్తున్నట్లు నమ్మబలికి ఓ గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే బాలిక తనపై జరిగిన అఘాయిత్యాన్ని క్వారంటైన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది.

బాధిత బాలిక ఫిర్యాదు మేర పోలీసులు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికకు వైద్యపరీక్షలు చేయించామని, రెండు,మూడు రోజుల్లో వైద్యుల నివేదిక వస్తుందని బీహార్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ దిల్మనీ మిశ్రా తెలిపారు. నిందితుడైన గార్డును అరెస్టు చేశామని పోలీసులు వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story