అతిధి పాత్రలో అక్షయ్.. పారితోషికం ఎంతనీ జస్ట్..

బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో అక్షయ్ కుమార్ ఒకరు. సాయం చేయడంలోనూ ముందుండే అక్షయ్ కి అభిమానులూ ఎక్కువే. సామాజిక సందేశాన్నిచ్చే చిత్రాలకు పెద్దపీట వేసే అక్షయ్ ప్రేక్షకులకు సందేశంతో పాటు వినోదాన్నిీ పంచుతాయి. ఒక్కో సినిమాకు వంద కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే అక్షయ్ తాజాగా ‘అట్రంగీ రే’ అనే చిత్రంలో అతిధి పాత్ర కోసం రూ.27 లక్షలు పుచ్చుకుంటున్నారు. ధనుశ్, సారా అలీఖాన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆనంద్ ఎల్. రాయ్ తెరకెక్కిస్తున్నారు. మొదట ఈ పాత్ర కోసం హృతిక్ ను సంప్రదించినా మరో సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడని తెలిసి అక్షయ్ ని సంప్రదించారట నిర్మాతలు.. భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసి ఆయనను ఈ సినిమాకు ఒప్పించారట.

Recommended For You