తూర్పు గోదావరి జిల్లాలో కరోనా ఉధృతి.. లాక్ డౌన్

ఏపీలో కరోనా మహమ్మారి మరింత ఉదృతంగా విస్తరిస్తోంది. ఏరోజుకారోజు రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. నిన్న ఏడు వేలమందికి పైగా వ్యాధి భారిన పడ్డారు. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 88 వేలు దాటింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తూర్పు గోదావరి జిల్లాలో లాక్ డౌన్ విధించారు. అమలాపురంలో ఈరోజు కర్ఫ్యూ అమలు చేశారు. పట్టణంలో ఏ ఒక్క షాపు తెరవకుండా ఎవరూ కాలు బయట పెట్టకుండా పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు.

అమలాపురం సబ్ డివిజన్ లో సిఐ, ఎస్సై లు అందరూ ఉదయం ఆరు గంటల నుంచే పోలీసులు పహారా కాస్తున్నారు. 24 గంటల పాటు ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. అనవసరంగా బయటకు వచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తామని వ్వార్కింగ్ ఇస్తున్నారు. ఆకారన్నగా బైకుల మీద యువత రోడ్లపైకి వస్తే బైక్ సీజ్ చేస్తామని అన్నారు.

Recommended For You