తలైవా ఆ వంద ఇంకా కట్టలేదు..

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఇటీవల ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల చెన్నైలో కారులో ప్రయాణించిన రజిని సీటు బెల్టు ధరించలేదు. దాంతో ట్రాఫిక్ పోలీసులు ఇది గమనించి.. తలైవాకు 100 రూపాయలు జరిమానా విధించారు. అయితే రజిని మాత్రం ఈ జరిమానా ఇంకా కట్టకుండా పెండింగ్ లో ఉంచారు. జూన్ 26 న ఆయనకు రూ .100 జరిమానా విధించారు. కాగా జూలై 20 న రజనీకాంత్ కేలంబక్కంలోని తన ఫామ్ హౌస్‌కు వెళ్లారు. అక్కడ తన వ్య‌వ‌సాయ క్షేత్రంలో కూతురు సౌంద‌ర్య‌, అల్లుడు విశాగ‌న్ వానంగ‌మూడి, మ‌న‌వ‌డు వేద్ కృష్ణ‌తో క‌లిసి ఉంటున్నారు.

Recommended For You