రవీనా మెచ్చిన ఫుట్‌బాల్‌ డ్యాన్స్ .. వీడియో

ఓ ముగ్గురు వ్యక్తులు ఫుట్‌బాల్‌ను ఉపయోగించి డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను బాలీవుడ్ నటి రవీనా టాండన్ శనివారం ట్విటర్ లో షేర్ చేశారు. రెండేళ్ల క్రితం నాటి వీడియో అయినా తాజాగా రవీనా షేర్ చేయడంతో వైరల్ గా మారింది. చాలా బాగా చేశారు బాయ్స్.. మీరు ఎక్కడ ఉన్నా ఈ ట్వీట్ మీకు చేరుతుందని ఆశిస్తున్నా అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్స్ కూడా అదే రీతిలో స్పందిస్తున్నారు. అద్భుతంగా డ్యాన్స్ చేసారంటూ ముగ్గురు బాయ్స్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒకరు స్పోర్ట్స్ డ్రస్ లో , మరొకరు లుంగీతో, ఇంకొకరు ఫార్మల్ దుస్తులు ధరించి కనిపిస్తారు. ముగ్గురు ఒకే సింక్ లో బాల్ తో స్టెప్పులేస్తున్న ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీడియోలో కనిపిస్తున్న ముగ్గురు వ్యక్తులు ఒక్కరే అతడి పేరు ప్రదీప్. ఫుట్‌బాల్‌ జీనియస్ వరల్డ్ రికార్డు టైటిల్ ను సాధించిన తమిళనాడుకు చెందిన ఫుట్‌బాల్‌ ఆటగాడు ప్రదీప్.

 

Recommended For You