భారత్‌‌కు రానున్న రాఫెల్ యుద్ధ విమానాలు

భారత్‌‌కు రానున్న రాఫెల్ యుద్ధ విమానాలు

సైనికుల ఆత్మవిశ్వాసాన్ని పెంచే రాఫెల్ యుద్ధవిమానాలు భారత్‌కు రానున్నాయి. ఈ విమానాలు బుధవారం దేశానికి రానున్నాయి. ఫ్రాన్స్ నుంచి భారత్‌కు చేరే లోపు యూఏఈలో ఇందనం కోసం ఆగుతాయి. ఇప్పుడు ఐదు విమానాలు భారత్‌కు రానున్నాయి. అందులో రెండు ట్రైనర్, మూడు యుద్ధ విమానాలు ఉన్నాయి. 2016లో జరిగిన ఒప్పందం ప్రకారం మొత్తం 36 యుద్ద విమానాలు కొనుగోలు చేశారు. ఇప్పటికే ఒక విమానం దేశానికి చేరుకోగా.. ఇప్పుడు మరో ఐదు వస్తున్నాయి. వాటిని నడిపేందుకు ప్రత్యేక ట్రైనింగ్ కావాలి.

ఇండియన్ ఎయిర్ ఫోర్సుకు చెందిన 12 మంది ఫైలట్లు ఫ్రాన్స్‌లో శిక్షణ పొందారు. మొత్తం 36 మంది ఫైలట్లకు ట్రైనింగ్ ఇచ్చేలా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. త్వరలో యుద్దవిమానాలు డెలివరీ చేయాలని జూన్ రెండున కోరారు. కరోనాను ముడిపెట్టకుండా విమానాలు డెలివరీ జరగాలని అన్నారు. దీని ప్రకారం ఫ్రాన్స్ ప్రభుత్వం రాఫెల్ విమానాలు పంపిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story