తమిళనటి విజయలక్ష్మి ఆత్మహత్యాయత్నం

తమిళ నటి విజయ లక్ష్మి ఆదివారం ఆత్మహత్యాయత్నం చేశారు. కొంతకాలంగా సోషల్ మీడియాలో వేధింపులు, బెదిరింపు కారణాలు ఆమెను తీవ్ర నిర్ణయం తీసుకునేలా చేశాయి. తన సోషల్ మీడియా ఖాతాలను ఉపయోగించి, విజయ లక్ష్మి అనేక వీడియోలను పోస్ట్ చేశారు, అందులో నామ్ తమిజార్ పార్టీ నాయకుడు సీమాన్ , పనంకట్టు పాడై హరి నాదర్ అనుచరులు అభిప్రాయ భేదాలపై తనను వేధించారని ఆరోపించారు. సీమన్, హరి నాడార్ ఫాలోవర్ల వేధింపుల వల్లే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు ఆ వీడియోలో విజయలక్ష్మి పేర్కొన్నారు.

పిల్స్ తీసుకుంటే రక్తపోటు తగ్గిపోయి మరణం సంభవిస్తుందని అన్నారు. దాంతో ఆమె నిద్రమాత్రలు మింగి ఉంటారని అనుకుంటున్నారు. ప్రస్తుతం విజయలక్ష్మిని చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో తనను వేధిస్తున్నందున వారిద్దరినీ వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు విజయ లక్ష్మి.

Recommended For You