తెలంగాణలో కొత్తగా 1610 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అయితే ఏపీ, కర్ణాటకలతో పోలిస్తే కేసులు తక్కువగానే నమోదు అవుతున్నాయి. గత 24 గంటల్లో తెలంగాణలో 1610 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 57,142కు చేరింది. సోమవారం 803 మంది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కావడంతో.. ఇప్పటివరకూ మొత్తం 42,909 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 75 శాతం దాటింది.

Recommended For You