సినీనటుడు కిక్ శ్యామ్ అరెస్ట్

ప్రముఖ తమిళ సినీనటుడు శ్యామ్ అరెస్ట్ అయ్యారు. చెన్నైలోని.. కోడంబాకంలోని పోకర్ క్లబ్ ను శ్యామ్ నిర్వహిస్తున్నాడు. అయితే అనుమతులు పోకర్ క్లబ్ కు తీసుకున్నా.. అందులో గ్యాంబ్లింగ్ తోపాటు పలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో క్లబ్ పై దాడి చేసిన పోలీసులు శ్యామ్ ను అరెస్ట్ చేశారు. తమిళంలో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన శ్యామ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.. తెలుగులో ఊసరవెల్లి, కిక్, రేసుగుర్రం సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందాడు.

Recommended For You