మెగా డాట‌ర్ ఎంగేజ్‌మెంట్ డేట్ ఫిక్స్

త్వరలో కొణిదెల వారి ఇంట బాజాభజంత్రీలు మోగనున్నాయి. నాగబాబు కూతురు నిహారికను చైత‌న్య‌కు ఇచ్చి వివాహం జరిపించనున్నారు. చైతన్య గుంటూరు ఐజీగా విధులు నిర్వర్తిస్తున్న జొన్నలగడ్డ ప్రభాకర్‌రావు కుమారుడు. చైత‌న్య‌తో నిహారిక‌కు ఆగ‌స్టు 13న నిశ్చితార్థం జ‌ర‌గ‌నుంది. కేవ‌లం కుటుంబ‌స‌భ్యులు, సన్నిహితుల మధ్యనే ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు కుటుంబసభ్యులు.

ఇప్ప‌టికే నిశ్చితార్ధానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది చివ‌ర్లో వివాహం జరిపిస్తామని ఇదివ‌ర‌కే నాగ‌బాబు వెల్లడించిన సంగ‌తి తెలిసిందే. చైతన్య బిట్స్‌ పిలానీలో మాస్టర్స్‌ ఇన్‌ మ్యాథమ్యాటిక్స్‌ డిగ్రీ పట్టా పొందారు. ఆ తర్వాత ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో ఎమ్‌బీఏ పూర్తి చేశారు. నిహారిక హ్యాపీ వెడ్డింగ్, సూర్య‌కాంతం వంటి చిత్రాల్లోనూ న‌టించారు.

Recommended For You