తెలంగాణలో భారీ వర్షాలు!

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తా ఆంధ్ర, రాయలసీమ మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతుంది. అలాగే నైరుతి రుతుపవనాలు సైతం చురుగ్గా కదులుతున్నాయి. దీంతో రాబోయే రెండు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

కాగా, మంగళవారం హైదరాబాద్‌ నగర శివారులోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. ముఖ్యంగా ఈసీఐఎల్, కుషాయిగూడ, జవహర్‌నగర్‌ మున్సిపల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. అలాగే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయి.

Recommended For You