బాలీవుడ్‌లో మ‌రో విషాదం.. ప్ర‌ముఖ స్టంట్ డైరెక్ట‌ర్ మృతి

బాలీవుడ్ లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ స్టంట్ డైరెక్ట‌ర్ ప‌ర్వేజ్ ఖాన్ కన్నుమూశారు. 55 ఏళ్ల పర్వేజ్ ఖాన్ సోమ‌వారం గుండెపోటుతో మృతి చెందారు. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు హ‌న్సాల్ మెహ‌తా ట్విటర్ ద్వారా తెలియ‌జేశారు. షాహిద్ చిత్రంలో అల్ల‌ర్ల‌కు సంబంధించిన స్టంట్ ను సింగిల్ టేక్ లో చేసి చూపించారు. ఎంతో ఎన‌ర్జిటిక్ గా క‌నిపించే ప‌ర్వేజ్ ఖాన్ మాట‌లు ఇప్ప‌టికీ నా చెవుల్లో మార్మోగుతున్నాయని ట్వీట్ చేశారు. ప‌ర్వేజ్ ఖాన్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

Recommended For You