ప్లాస్మా దానం చేస్తే రూ.5వేలు ఇవ్వండి: సీఎం జగన్

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కరోనా విషయంలో కీలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా చికిత్సలో భాగంగా ప్లాస్మా థెరపీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కరోనా నుంచి కోలుకున్న వారిలో అవగాహన కలిగించాలని అన్నారు. కరోనా నుంచి కోలుకొన్న వారు ప్లాస్మా దానం చేస్తే 5వేలు రూపాలయలు ఇవ్వాలని తెలిపారు. దీంతో వారి ఆరోగ్యానికి, మంచి భోజనం తీసుకోవడానికి ఉపయోగపడుతుందని అన్నారు. కాగా.. కరోనా రోగులపై ప్లాస్మా థెరీపీ ద్వారా చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ, మహారాష్ట్రలో ఈ చికిత్స ద్వారానే కరోనా రికవరీ రేటు గణనీయంగా పెరిగింది.

Recommended For You