నిమ్మగడ్డను పునర్నియమించడంపై కన్నా ట్వీట్

న్యాయస్థానం చీవాట్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పునర్నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీ కీలక నేత, ఏపీబీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ హర్షం వ్యక్తం చేశారు. కాగా గతకొద్దిరోజులుగా నిమ్మగడ్డను తిరిగి నియమించాలంటూ కన్నా లక్ష్మీనారాయణ కోరుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిమ్మగడ్డను పునర్నియమించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కన్నా లక్ష్మీనారాయనే కాదు రాష్ట్రంలోని ప్రజాస్వామ్యవాదులంతా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుండటం విశేషం.

Recommended For You