శానిటైజర్ తాగి 10 మంది మృతి!

ఏపీలోని ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. కురిచేడులో శానిటైజర్ తాగి పది మంది మృతి చెందారు. కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో పలు చోట్ల మద్యం దుకాణాలు మూసివేస్తున్నారు. అయితే మద్యం దొరక్కపోవటంతో కొందరు శానిటైజర్‌కు అలవాటు పడ్డారు. పలువురు యాచకులు, స్థానికులు.. శానిటైజర్ తాగటంతో గురువారం రాత్రి ముగ్గురు మృతి చెందారు. చికిత్స పొందుతూ శుక్రవారం మరో ఏడుగురు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

కురిచేడులో లాక్ డౌన్ అమలులో ఉన్నందున మద్యం షాపులు మూసివేయడంతో శానిటైజర్ తాగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శానిటైజర్ తాగడం వల్ల మృతి చెందారా? లేక నాటుసారా, కల్తీ మద్యం ఏమైనా సేవించారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

Recommended For You