లైన్లో మరో పెళ్లి కొడుకు.. ‘నిన్నుకోరి’ వచ్చేదెవరో

ఆరడుగుల అందగాడు ఆది పినిశెట్టి.. నటుడిగా ఎంట్రీ ఇచ్చి కొద్దికాలమే అయినా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుని అభిమానులను సంపాదించుకున్నాడు. నిన్నుకోరి, రంగస్థలం, యూ టర్న్ వంటి పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విభిన్న పాత్రలు పోషించి సక్సెస్ ఫుల్ నటుడు అనిపించుకున్నారు. కరోనా ప్రభావంతో షూటింగ్ లు లేక ఖాళీగా ఉంటున్న హీరోలకు పెళ్లిమీద మనసు పోతోంది.

ఖాళీగా ఉన్న టైమ్ లో కబుర్లు చెప్పుకోవడానికి ఓ తోడుంటే బావుంటుందని అనుకుంటున్నారో ఏమో వరుసగా క్యూ కట్టేస్తున్నారు బ్యాచిలర్ హీరోలంతా. ఇప్పుడు ఆ వరుసలో ఆది పినిశెట్టి వచ్చి చేరారు. ఇంతకీ ఈ యువ నటుడిని చేసుకోబోయే ఆ అమ్మాయి ఎవరంటే.. ఆదితో పాటు మలుపు, మరకతమణి చిత్రాల్లో నటించిన కోస్టార్ నిక్కీ గల్రానీని అని టాక్ వినిపిస్తోంది. కరోనా సంక్షోభం ముగిసిన తరువాత పెళ్లి పై అభిమానులకు క్లారిటీ ఇవ్వనున్నాడట. అయితే అటు నిక్కీ గల్రానీ కానీ, ఇటు ఆది కాని ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

Recommended For You