విశాఖలో ఘోర ప్రమాదం.. 10మంది మృతి

విశాఖలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో క్రేన్ కూలి 10మంది మృతి చెందారు. క్రేన్ తనిఖీ చేస్తుండగా ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయంలో ఘటనాస్థలంలో ఉన్న 10 మంది అక్కడికక్కడే మరణించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థాలానికి చేరకొని కేసు నమోదు చేశారు. మృతుల కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకున్నారు. కాగా.. గత కొన్ని నెలల నుంచి విశాఖలో వరుస ప్రమాదాలు చోటు చేసుకోవడం చర్చనీయాంశం. ఎల్జీ పాలిమర్స్, ట్యాంక్ పేలుడు ఇప్పుడు షిప్ యార్డ్ ప్రమాదం.. ఇలా వరుస ప్రమాదాలతో విశాఖ ప్రజలు ఆందోళను గురవుతున్నారు.

Recommended For You