ఆ ముగ్గురూ నా బిడ్డలే: సోనూసూద్

అందరి బంధువు.. ఆదుకునే ప్రభువు.. ఎవరైనా ఉన్నారా అంటే సోనూ సూద్ పేరే చెప్తారేమో.. కష్టం వస్తే కచ్చితంగా బాలీవుడ్ నటుడు సోనూసూద్ పేరే వినిపిస్తోంది ప్రస్తుతం. తల్లిదండ్రుల మరణంతో అనాథలైన ముగ్గురు చిన్నారుల బాధ్యత సోనూ తీసుకుంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ (ఎం) మండల కేంద్రానికి చెందిన గట్టు సత్తయ్య 18 నెలల క్రితం మరణించారు. అతని భార్య అనురాధ కూడా నాలుగు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో వారి ముగ్గురు పిల్లలు మనోహర్ (10), లాస్య (7), యశ్వంత్ (4) అనాథలయ్యారు. ఈ విషయాన్ని కరణం రాజేష్ అనే వ్యక్తి ట్విట్టర్ లో సోనూ సూద్ కు ట్యాగ్ చేశారు. వెంటనే స్పందించిన సోనూ ‘ఆ ముగ్గురు చిన్నారులు అనాథలు కారు, వారి బాధ్యత నాది’ అని ట్వీట్ చేశారు.

Recommended For You