షిప్‌యార్డ్ ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లో జరిగిన ప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్రేన్ కూలి 10 చనిపోయిన విషయం తెలిసిందే. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించన టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రమాద సమయంలో క్రేన్ వద్ద 30 మంది వరకు ఉన్నారని తెలుస్తుందని.. వారంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాని ఆయన ట్వీట్ చేశారు. ఇదే విషయంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సంతాపం తెలియ‌జేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో గాయాలైన వారికి మెరుగైన చికిత్స అందించాలని కోరారు

Recommended For You