మెక్సికోలో కరోనా విలయతాండవం..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా స్వైర విహారం చేస్తోంది. పలు దేశాల్లో కరోనా తన ప్రతాపం చూపిస్తోంది. ఇక మెక్సికోలో కరోనా విలయతాండవం చేస్తోంది. దేశంలో రోజురోజుకూ కరోనా కేసులతో పాటు మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4,16,179 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 46 వేల మందికిపైగా మృతి చెందారు. గడిచిన 24గంటల్లో దేశంలో 5,752 పాజటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి ఒక్కరోజే 485 మంది మృత్యువాతపడ్డారు.

Recommended For You