రాజధాని విషయంలో బీజేపీ ఇక డ్రామాలు కట్టిపెట్టాలి: సీపీఐ రామకృష్ణ

మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపడాన్ని ఏపీలో పలు పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. గవర్నర్ ఈ రెండు బిల్లులకు ఆమోదం తెలపడం అప్రజాస్వామికమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తప్పుబట్టారు. మెజారీటి ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా గవర్నర్ బిల్లులను ఆమోదించారని విమర్శించారు. గతంలో ఎన్నికల కమిషనర్ ను తొలిగించే విషయంలో కూడా ఇలాగే తొందరపడి నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. ఇలాంటి తొందరపాటు నిర్ణయం సరికాదని మంచిది కాదని అన్నారు. న్యాయంస్థానంలో న్యాయం జరగుతుందని ఆశించారు. రాజధాని అంశం కేంద్రం పరిధిలో లేదని చెబుతున్న బీజేపీ ఇకనైనా డ్రామాలు కట్టిపెట్టాలని రామకృష్ణ హితవుపలికారు.

Recommended For You