మూడు రాజధానుల బిల్లుకు ఆమోదం తెలిపిన గవర్నర్

ఏపీలో పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించారు. గత కొన్ని రోజుల నుంచి ఈ బిల్లుల విషయంలో గవర్నర్ నిర్ణయం కోసం ఏపీ ప్రజలు, రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. మూడు వారాల క్రితం ఈ రెండు బిల్లులను ప్రభుత్వం గవర్నర్ దగ్గరకు పంపించాయి. తాజాగా గవర్నర్ ఆమోదం తెలపడంతో శాసన ప్రక్రియ పూర్తైందని ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ రెండు బిల్లులు ఆమోదం తెలపవద్దని అధికార వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు గవర్నర్ కు లేఖలు రాసిన విషయం తెలిసిందే. దీంతో గవర్నర్ న్యాయ సలహా తెలుసుకున్నారు. తరువాత వీటిని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జూన్‌ 16న రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులశాసనసభ ఆమోదం తెలిపింది.

Recommended For You