ఇంజన్ లేకుండానే రైలు.. ప్రపంచంలో ఏకైక హార్స్ ట్రైన్

ఇంజన్ లేకుండానే రైలు.. ప్రపంచంలో ఏకైక హార్స్ ట్రైన్

ఐడియా ఎంత బావుంది. ట్రైన్ ఎక్కకుండానే, రోడ్డు మీద ప్రయాణించకుండానే గమ్య స్థానం చేరుకోవచ్చు. గుర్రం మీద కూర్చుని ప్రయాణించాలంటే గుర్రపు స్వారీ వచ్చి వుండాలి. అయినా ఒకరు ఇద్దరు కంటే ఓ పది పదేహేనుమంది కూర్చుని వెళ్లడం అయితే అసలు సాధ్యం కాదు. ఆలోచనల్లోంచే ఐడియాలు వస్తాయంటే ఇదే కాబోలు. పాకిస్తాన్ లోని పంజాబ్ లో ఉన్న ఫైసలాబాద్ జిల్లా బచియానా రైల్వే స్టేషన్ నుంచి 11,000 జనాభా కలిగిన గంగాపైర్ గ్రామానికి వెళ్లాలంటే సరైన సౌకర్యాలు లేవు. రోడ్డు మార్గం కూడా సరిగా లేదు.

దాంతో 1898లో గంగారాం అనే ఆయన 15 మంది ప్రయాణికులు ఒకేసారి ప్రయాణించేందుకు వీలుగా గుర్రం రైలును ఏర్పాటు చేయాలనుకున్నారు. గంగారాం లాహోర్, డిల్లీలలో గంగారామ్ ఆస్పత్రి పేరుతో పేదలకు అతి తక్కువ ఫీజులతో వైద్యం అందిస్తుంటారు. ఆయనను సేథ్ గంగారాం అని కూడా అంటారు. ఇక ఈ హార్స్ ట్రైన్ కోసం ఓ చిన్న రైల్వే లైను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు దాని మీద కూర్చుని సురక్షితంగా వారి గ్రామానికి చేరుకుంటారు. రెండు శతాబ్ధాలు గడిచినా ఇప్పటికీ ఈ రైల్వే లైను ఉంది. నేటికీ ప్రయాణీకులు ఈ హార్స్ ట్రైన్ మీద రాకపోకలు సాగిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story