జూన్ 29 నుంచి సుశాంత్ ఏం చేయాలనుకున్నాడు..

బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఈ ఏడాది జూన్ 14 న బాంద్రాలోని తన నివాసంలో కన్నుమూశారు. 34 ఏళ్ల సుశాంత్ మరణం దేశం మొత్తాన్ని షాక్‌కు గురిచేసింది. అనంతర పరిణామాల నేపథ్యంలో ముంబై పోలీసులు ప్రస్తుతం ఈ కేసును విచారిస్తున్నారు. అయితే, బీహార్ పోలీసులు కూడా కేసు విచారణలో పాలు పంచుకున్నా తరువాత అనేక షాకింగ్ విషయాలు ఒకదాని తరువాత ఒకటి వెలుగుచూస్తున్నాయి. ఇదిలావుండగా, అమెరికాలో ఉంటున్న సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కృతి ఇన్‌స్టాగ్రామ్‌లో.. సుశాంత్ రాసుకున్న వైట్ బోర్డ్ ని పోస్ట్ చేశారు. దానిపై సుశాంత్ జూన్ నెలలో తన ప్రణాళికలను రాశారు.

బోర్డులో తన వర్కవుట్లు తిరిగి ప్రారంభించాలనుకుంటున్నట్లు రాసుకున్నాడు. దాంతో పాటు మెడిటేషన్ చేయాలని భావించాడు. జూన్ 29 నుంచి ప్రతి రోజూ చేస్తానని రాసుకున్నాడు. ఒక రోజు ముందు, శ్వేతా తన దివంగత సోదరుడికి న్యాయం చేయాలని కోరుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. కాగా, ఆగస్టు 5 న నటి రియా చక్రవర్తి దాఖలు చేసిన బదిలీ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉంది . బీహార్ పోలీసులు తమపై నమోదు చేసిన కేసును ముంబై పోలీసులకు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ రియా బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

 

Recommended For You