జగన్ మాట తప్పి మడమ తిప్పారు : చిన్న రాజప్ప

ఎన్నికలకు ముందు అమరావతిలోని రాజధానిని కొనసాగిస్తామని చెప్పిన జగన్.. ఇప్పుడు మూడు రాజధానులు అనడం దారుణమని మాజీ హోంమంత్రి నిమ్మకాయల చిన్న రాజప్ప మండిపడ్డారు. ముఖ్యమంత్రి అయ్యాక జగన్ మాట తప్పారు, మడమ తిప్పారు అని విమర్శించారు. రాజధానికోసం విలువైన భూములు ఇచ్చిన రైతులను నట్టేట ముంచారని అన్నారు. ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకుండా నా మాటే వేదవాక్కు అనే విధంగా సీఎం వ్యవహరించడం, గవర్నర్ మూడు రాజధానుల బిల్లును ఆమోదించడం దురదృష్టకరమని చిన్న రాజప్ప అన్నారు.

Recommended For You