ఈనెల 5న తెలంగాణ కేబినెట్‌ భేటీ

తెలంగాణలో కరోనా మహమ్మారి‌ విభృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈనెల 5న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఈ సమావేశం జరగనుంది. క్యాబినెట్ భేటీలో ముఖ్యంగా కరోనా నియంత్రణ, వైరస్‌ నిర్ధారణ పరీక్షలు, రోగులకు వైద్యంపై తీసుకురావాల్సిన చర్యలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది .. అంతేకాకుండా కొత్త సచివాలయం నిర్మాణం, వ్యవసాయ అంశాలు క్యాబినెట్ భేటీలో చర్చకు రానున్నాయి.

Recommended For You