నేపాల్‌లో గేట్లు తెరిస్తే.. యూపీ మునిగింది

యూపీలో బహ్రాయిచ్ జిల్లాలో 61 గ్రామాలు నీటమునిగాయి. అయితే, దీనికి కారణం యూపీలో ఎడతెరపి లేని వర్షాలు కాదు, తుపాన్లు కాదు. నేపాల్ లో మూడు బ్యారేజ్‌ల గేట్లు తెరిస్తే.. దానికి యూపీ లో పలు గ్రామాలు నీటమునిగాయి. మొత్తం 1.5 లక్షల మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 171 ఇళ్లు ధ్వంసమయ్యాయి. నేపాల్ నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని ఒక్కసారిగా విడుదల చేయడంతో క్రిందన ఉన్న యూపీలోని కొన్ని గ్రామాలపై తీవ్రంగా ఆ ప్రభావం పడింది. ఏడు గ్రామాల పరిస్థితి దారుణంగా ఉంది. దీంతో 32 ప్లడ్ పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. ఒక మోటర్ బోట్, 179 పడవలు, ఒక ప్లాటూన్ వరద పిఎసిలతో పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగింది. వీలైనంత త్వరగా అక్కడ సాదారణ పరిస్థితులు ఏర్పడేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా అధికారులు విశ్రాంతి లేకుండా పని చేస్తున్నారు.

Recommended For You