ఏడాది చివరినాటికి కరోనా వ్యాక్సిన్ వస్తుంది: డా. ఆంథోని ఫాసీ

ఏడాది చివరినాటికి కరోనా వ్యాక్సిన్ వస్తుంది: డా. ఆంథోని ఫాసీ

కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో అమెరికాలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలర్జీ అండ్‌ ఇన్‌ఫెక్షియస్‌ డిసీజెస్‌ నిపుణులు డాక్టర్‌ ఆంథోని ఫాసీ ఓ శుభవార్త చెప్పారు. ఈ ఏదాడి చివరికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందనే నమ్మకం ఉందని.. ఇప్పటికే 2.5 లక్షల మంది క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగస్వామ్యం కావడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని ఆయన అన్నారు. తమ చేస్తున్న ప్రయోగాలపై క్లినికల్ ట్రయల్స్ కి ఇంత ఎక్కువగా హాజరుకావడం తమ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందని ఆయన తెలిపారు. మరోవైపు కరోనా నేపథ్యంలో జాగ్రత్తను గురించి మాట్లాడుతూ.. అమెరికాలో కరోనా నిర్థారణ పరీక్షల ఫలితాలు త్వరగా అందించలేకపోతున్నామని.. కనుక అమెరికా ప్రజలు కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు మాస్కులు ధరించాలని కోరారు. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story