ప్లాస్మా దానం చేసిన 67 మంది పోలీసులు

కరోనా నుంచి కోలుకున్న 67 మంది పోలీసులు ప్లాస్మా దానం చేశారు. శనివారం గౌహతి మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో పోలీసు సిబ్బంది తమ ప్లాస్మాను దానం చేశారు. ఈ సందర్భంగా అసోం ఆరోగ్యశాఖ మంత్రి హిమంత బిస్వా శర్మ వారిని సత్కరించారు. ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌ ప్లాస్మా దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్లాస్మా దానం చేసిన సిబ్బందిని పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ భాస్కర్‌ జ్యోతి మహంత అభినందించారు. కాగా ఇప్పటి వరకు 1,552 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇందులో 1,086 మంది కోలుకున్నారు. మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో 279 మంది తిరిగి విధుల్లో చేరారు.

Recommended For You