బీఎస్‌4 వాహనాలకు నో రిజిస్ట్రేషన్‌.. ఎందుకంటే?

బీఎస్‌4 వాహనాలకు నో రిజిస్ట్రేషన్‌.. ఎందుకంటే?

బీఎస్‌4 ప్రమాణాలతో ఉండే వాహనాల రిజిస్ట్రేషన్‌కు బ్రేకులు పడ్డాయి. ఇక పరుగులు ఆపేల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మార్చిలో లాక్‌డౌన్‌ విధించిన తర్వాత జరిగిన వాహన విక్రయాల అంశంపై తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా రిజిస్ట్రేషన్‌ చేయొద్దంటూ న్యాయస్తానం ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 13కి వాయిదా వేసింది.

వివరాల్లోకి వెళితే .. గత ఆదేశాల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌4 ఇంధన ప్రమాణాలతో తయారైన వాహన విక్రయాలు ఆపాలి. బీఎస్‌6 వాహనాలను మాత్రమే అమ్మాలి. లాక్‌డౌన్‌ వల్ల బీఎస్‌4 వాహన విక్రయాల విషయంలో కాస్త సడలింపు ఇచ్చింది ప్రభుత్వం. లాక్‌డౌన్‌ ఎత్తివేశాక 10 రోజుల పాటు వీటిని అమ్ముకునేందుకు న్యాయస్థానం అనుమతించింది. కానీ మార్చి 25 తర్వాత లాక్‌డౌన్‌ అమలు కాలంలో కూడా భారీ స్థాయిలో బీఎస్‌4 వాహనాల విక్రయాలు జరగడాన్ని సుప్రీం తీవ్రంగా పరిగణించింది. అందుకే తాజా తీర్పు వెలువరించింది. దీనిపై కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అటు కార్లు కొన్న కస్టమర్లు కూడా ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story