విదేశీ భాషల నుంచి చైనీస్‌ను తొలగించిన కేంద్రం

భారత్‌లో కొత్త విద్యావిధానాన్ని అమలుకి కేంద్రం చర్యలు తీసుకుంటుంది. కొత్త విద్యావిధానంలో భాగంగా భారతీయ విద్యార్థులు అభ్యశించడానికి అందుబాటులో ఉన్న భాషల నుంచి చైనీస్ ను కేంద్ర తొలగించింది. గత ఏడాది రూపొందించిన ముసాయిదా జాబితాలో చైనా భాషకు స్థానం లభించినప్పటికీ ఇటీవల విడుదల చేసిన తుది జాబితాలో మాత్రం చోటు కోల్పోయింది. విద్యార్థులు ఫ్రెంచ్, జర్మన్, జపనీస్, కొరియన్, స్పానిష్, పోర్చుగీస్, రష్యన్, థాయ్ భాషలను ఎంచుకోవచ్చని కేంద్రం పేర్కొంది. ప్రపంచ భాషలను అభ్యషించడంవలన ప్రపంచ సంస్కృతిని అర్థం చేసుకోవడమే విదేశీ భాషల ముఖ్య లక్ష్యమని తెలిపింది. కాగా.. భారత్, చైనా సరిహద్దు నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్.. చైనా విషయంలో కాస్తా కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా.. భారతీయ విద్యార్థులు నేర్వదగిన విదేశీ భాషల జాబితాలోనూ చైనీస్ స్థానం కోల్పోయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com