కరోనా ఎఫెక్ట్‌.. పశ్చిమ బెంగాల్‌ సచివాలయం మూసివేత

పశ్చిమ బెంగాల్‌‌లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. తాజాగా రాష్ట్ర సచివాలయం విధుల్లో ఉన్న సబ్‌ ఇన్‌స్పెక్టర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సచివాలయం ‘నబన్నా’ ను సోమవారం, మంగళవారం మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. సచివాలయంలో రెండు రోజుల పాటు శానిటేషన్‌ పనులు చేపట్టనున్నట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం 50 శాతం మంది సిబ్బందితో ‘నబన్నా’ పని చేస్తున్నప్పటికీ సీఎం మమతా బెనర్జీ ప్రతి రోజు కార్యాలయానికి హాజరవుతున్నారని అధికారి తెలిపారు.

Recommended For You