ఒడిశాలో ఒక్కరోజే 1434 కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. నిత్యం పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతండటంత.. ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక ఒడిశాలో కరోనా వైరస్‌ కలకలం సృష్టిస్తోంది. రోజు రోజుకీ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,434 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 34,913కు చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకొని 21,273 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,404 యాక్టివ్‌ కేసులున్నాయి.

Recommended For You